సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారత పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం స్వయంగా ఆయనను మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు.
బలమైన గల్ఫ్ దేశంగా సౌదీకి పేరుంది. ప్రధాని మోదీయే స్వయంగా స్వాగతం పలకడం చూస్తే ఈ పర్యటన ప్రాధాన్యం అర్థమవుతోంది.
A new chapter in bilateral relations
— Raveesh Kumar (@MEAIndia) February 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Breaking protocol, PM @narendramodi personally recieves HRH Prince Mohammed bin Salman bin Abdulaziz Al-Saud, Crown Prince of Saudi Arabia as he arrives on his first bilateral visit to India! pic.twitter.com/yVADgQ2IUu
">A new chapter in bilateral relations
— Raveesh Kumar (@MEAIndia) February 19, 2019
Breaking protocol, PM @narendramodi personally recieves HRH Prince Mohammed bin Salman bin Abdulaziz Al-Saud, Crown Prince of Saudi Arabia as he arrives on his first bilateral visit to India! pic.twitter.com/yVADgQ2IUuA new chapter in bilateral relations
— Raveesh Kumar (@MEAIndia) February 19, 2019
Breaking protocol, PM @narendramodi personally recieves HRH Prince Mohammed bin Salman bin Abdulaziz Al-Saud, Crown Prince of Saudi Arabia as he arrives on his first bilateral visit to India! pic.twitter.com/yVADgQ2IUu
"ఇది ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయం. ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా సౌదీ యువరాజుకు స్వాగతం పలికారు " - ట్విట్టర్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్.
ప్రధాని మోదీ, యువరాజు మధ్య బుధవారం విస్త్రతస్థాయి చర్చలు జరగనున్నాయి. ఇందులో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రధానాంశం అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాలు, ఉమ్మడి నావికా కసరత్తు అంశాలను చర్చించనున్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం మేరకు సౌదీ యువరాజు బుధవారం రాత్రి 11 గంటల 50 నిమిషాలకు దిల్లీ నుంచి బయల్దేరనున్నారు.