పుల్వామా ఉగ్రదాడి జరిగిన రెండు రోజుల అనంతరం పాక్ సరిహద్దుకు సమీపంలోని పోఖ్రాన్లో విన్యాసాలు నిర్వహించటం ప్రాధాన్యత సంతరించుకుంది.
సైన్యాధికారి బిపిన్ రావత్, వైమానిక దళాధిపతి ధనోవా, ఇతర దేశాల రక్షణ శాఖ అధికారులు ఈ విన్యాసాలను వీక్షించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ కూడా హాజరయ్యారు.
కేంద్రం ఆదేశిస్తే ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఐఎఎఫ్ చీఫ్ ధనోవా. మన వాయుసేన సామర్థ్యాన్ని పరీక్షించేందుకు పగలే కాకుండా రాత్రీ విన్యాసాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో లక్ష్యాలను ఛేదించే ప్రయోగాలు చేస్తున్నట్లు వివరించారు.
ఈ విన్యాసాల్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్ధవిమానం(ఎల్సీఏ) తేజస్‌తో పాటు, అత్యాధునిక తేలికపాటి హెలికాఫ్టర్(ఏఎల్‌హెచ్), ఆకాష్ క్షిపణుల్ని ఉపరితలం నుంచి గాల్లోకి విన్యాసాలు నిర్వహించారు. భారతదేశ అధునాతన యుద్ధవిమానాలతో అద్భుత విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు.
మొత్తం విన్యాసాల్లో 137 యుద్ధవిమానాల్ని ప్రదర్శించారు. ఎస్‌యూ, మిరాజ్, జాగ్వార్, మిగ్-21, 27, 29 ల విన్యాసాలు చూపరుల్ని కట్టిపడేశాయి. మంటలు విరజిమ్ముతూ యుద్ధవిమానాలు, హెలికాఫ్టర్లు ఆకాశంలోకి దూసుకెళ్లాయి.