అక్రమ నగదు బదిలీ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బావ రాబర్ట్ వాద్రాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం 3 గంటలపాటు విచారించింది. అనంతరం అనారోగ్యంగా ఉన్నందున తన వాదనల నమోదు ప్రక్రియను ఆపివేయాలని వాద్రా కోరగా, అందుకు అధికారులు అంగీకరించారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఈడీ కార్యాలయం ముందు వాద్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు.
వాద్రాను తిరిగి శుక్రవారం విచారించే అవకాశంఉందని ఈడీ అధికారులు తెలిపారు. లండన్‌లో ఆస్తుల కొనుగోలుకు వాద్రా అక్రమ నగదు బదిలీ నేరానికి పాల్పడ్డారనే కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే 23 గంటల సమయం వాద్రాను ప్రశ్నించింది. ఈడీకి సహకరించాల్సిందిగా వాద్రానుదిల్లీ కోర్టు సైతం ఆదేశించింది.