అక్రమ నగదు బదిలీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా ఈరోజు ఈడీ విచారణకు హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగా దర్యాప్తునకు హాజరు కాలేకపోయారని వాద్రా తరఫు న్యాయవాది దర్యాప్తు అధికారికి వివరించారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. బుధవారం లేదా ఇరు వర్గాలు అంగీకరించిన తేదీలో విచారణకు హాజరు కావాలని సూచించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈ నెలలో మూడు రోజులపాటు విచారణ ఎదుర్కొన్నారు వాద్రా.
బికనేర్ కుంభకోణం కేసులోనూ రాజస్థాన్లోని జైపుర్లో ఈడీ విచారణకు రెండు రోజులు హాజరయ్యారు వాద్రా.