ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం... వాద్రాకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ నేటి వరకు ఇచ్చిన గడువును మార్చి 2వరకు పొడిగించింది.
కక్ష సాధింపే...
లండన్‌లో 19లక్షల పౌండ్లు విలువైన ఆస్తుల కొనుగోలులో వాద్రా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో రూ.4.62కోట్లు విలువైన ఆస్తులు అటాచ్ చేసినట్లు ఈడీ శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రకటనను ఫేస్బుక్ పోస్ట్‌లో తప్పుబట్టారు వాద్రా.
నేను ఏదీ దాయటం లేదు. చట్టానికి వ్యతిరేకిని కాదు. దాదాపు 6 రోజులు... రోజుకు 8 నుంచి 12 గంటల పాటు ఈడీ అధికారులు విచారించేవారు. మధ్యలో 40 నిమిషాలు మాత్రమే భోజన విరామ సమయం. చివరకు మూత్రశాలల వద్దకూ భద్రతా సిబ్బంది వచ్చేవారు.నా పని ప్రదేశం, కార్యాలయంపై సోదాల తీరు చూస్తుంటే ఈడీ పూర్తిగా అధికారాలను దూర్వినియోగం చేసినట్లు కనుబడుతోంది. ఇది పగ, ప్రతీకార చర్యలా ఉంది. సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. న్యాయం జరిగే వరకు పోరాడతాను
--ఫేస్బుక్ పోస్ట్‌లో వాద్రా