ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. సొంత చెల్లినే కాల్చి చంపాడు ఓ అన్న. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించటమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.
ఆదేశ్ కుమార్ కుటుంబం బోపాడలో నివసిస్తుంది. మూడు రోజుల క్రితం రెస్టారెంట్లో నలుగురు అసభ్యంగా ప్రవర్తించారని కుమార్ సోదరి ధ్యాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడే ధ్యాని వేరే వ్యక్తిని ప్రేమిస్తోందని తెలుసుకున్న కుమార్ తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదేశ్ను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: టపాసులే యమపాశాలా!