ఉత్తర్ ప్రదేశ్ బదోహీలోని రోహతా బజార్లో ఓ దుకాణంలో జరిగిన పేలుడులో 13మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 3 ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద కొంతమంది చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
పేలుడు సంభవించిన దుకాణం మన్సూరికి చెందింది. ఈయన కుమారుడు దుకాణం వెనుక భాగంలో కార్పెట్ కర్మాగారాన్ని నిర్వహిస్తున్నాడు. దీనిలో పనిచేసే వారే శిథిలాలు కింద చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మన్సూరి అక్రమంగా టపాసులు తయారుచేస్తాడని స్థానికులు తెలిపారు. పేలుడుకు ఇదే కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.