నాలుగో వంతు దేశ ప్రజల వంట గ్యాస్ అవసరాలను తీర్చే ఎల్పీజీ గ్యాస్ పైప్లైన్కు ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు. గుజరాత్లోని కాండ్లా నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ వరకు 1,987 కిలోమీటర్ల మేర ఉండే ఈ పైప్లైన్ దేశంలోనే అత్యంత పొడవైనదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
ఈ పైప్లైన్ అహ్మదాబాద్(గుజరాత్), ఉజ్జయిని, భోపాల్(మధ్యప్రదేశ్), కాన్పూర్, అలహాబాద్, వారణాసి, లక్నో గుండా వెళ్లనుంది. రూ. 9,000 కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టును చేపడుతోంది.
ప్రస్తుతం గేయిల్(గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ఆధ్వర్యంలో గుజరాత్లోని జామ్నగర్ నుంచి దిల్లీ దగ్గరున్న లోని వరకు అత్యంత పొడవైన 1,415 కిలోమీటర్ల గ్యాస్ పైప్లైన్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎల్పీజీ పైప్లైన్ కూడా ఇదే కావొచ్చని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు.