ETV Bharat / bharat-news

'ట్రంప్​-కిమ్'​ హెయిర్​కట్​​ - vietnam

వియత్నాం రాజధాని హనోయ్​లో ట్రంప్​-కిమ్​ భేటీ మరోవారంలో జరగనుంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు ఇరు దేశాధినేతల హెయిర్​కట్స్​తో ఆకట్టుకుంటున్నారు.

'ట్రంప్​-కిమ్'​ హెయిర్​కట్​​
author img

By

Published : Feb 20, 2019, 8:08 PM IST

అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్'​, ఉత్తర కొరియా అధినేత 'కిమ్​ జోంగ్​ ఉన్'​ వియత్నాం రాజధాని హనోయ్​​లో రెండోసారి భేటీ కానున్నారు. మరోవారంలో ఇరువురు నేతల సమావేశం జరగనున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు నూతన హెయిర్​స్టైల్​కు తెరతీశారు. ట్రంప్​, కిమ్​ హెయిర్​కట్​తో సరికొత్తగా కనిపిస్తున్నారు. అందుకనుగుణంగా ఈ నెల 28 వరకు ఉచితంగా హెయిర్​కట్​ చేస్తున్నారు స్థానిక క్షౌరశాల నిర్వాహకులు.​

భేటీలో భాగంగా వచ్చే ఇరు దేశాధినేతలు తమను చూసే అవకాశమున్నందున ఇలా చేస్తున్నామని హనోయ్​​ ప్రజలంటున్నారు. కొంచెం బొద్దుగా, చిన్నగా ఉన్న వ్యక్తులు 'కిమ్'​ను పోలిన హెయిర్​ స్టైల్​ చేసుకోడానికి ఇష్టపడుతున్నారు. మరికొందరేమో జట్టుకు రంగేసుకుని ట్రంప్​లా మారుతున్నారు. తమ క్షౌరశాలకు వచ్చే వారిలో ఎక్కువ మంది కిమ్​ హెయిర్​స్టైల్​ చేసుకోవడానికే మొగ్గుచూపుతున్నారని క్షురకులు తెలిపారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.