ప్రస్తుతం అమల్లో ఉన్న ముమ్మారు తలాక్ ఆర్డినెన్సు గడువు ముగిసిన కారణంగా కొత్తగా మళ్లీ ఆర్డినెన్సును జారీ చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది రెండో సారి జారీ చేసిన ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేసినట్లు న్యాయశాఖ తెలిపింది. ఆర్డినెన్సు తిరిగి జారీ చేయటానికి కేంద్ర మంత్రి వర్గం మంగళవారమే ఆమోదం తెలిపింది.
తలాక్ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినా, విపక్షాల వ్యతిరేకతతో రాజ్యసభలో తిరస్కరణకు గురయింది. జూన్ 3న లోక్ సభ రద్దయ్యేలోపు తలాక్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకపోతే వీగిపోతుంది.
భార్యకు విడాకులు ఇస్తే జైలుకు పంపడం అనేది సంమజసం కాదని విపక్షాలతో పాటు, మత పెద్దలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం ముస్లిం మహిళలకు న్యాయం, సమానత్వం కోసం ఈ నిబంధన అవసరమని పునరుద్ఘాటించింది.
మూడేళ్ల జైలు శిక్ష
తలాక్ ఆర్డినెన్సు ప్రకారం తలాక్ పేరుతో అప్పటికప్పుడు విడాకులు ఇవ్వడం నేరం. ఇలా చేస్తే భర్తకు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.
రాజ్యసభలో లభించని మద్ధతు
తలాక్ బిల్లు యాథాతథంగా ఆమోదం పొందింతే ప్రయోజనాల కంటే దుర్వినియోగం ఎక్కువయ్యే ప్రమాదముందన్న విపక్షాల ఆందోళనలతో గతంలో మంత్రివర్గం మూడు సవరణలు చేసింది. విపక్షాలు మరిన్ని సవరణలు ప్రతిపాదించగా, ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందలేదు.