![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
పుల్వామాలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందారు.
పుల్వామా ఘటనకు సంబంధించి తదుపరి పరిణామాలపై అన్ని పార్టీల అభిప్రాయాన్ని కోరనుంది కేంద్రం. ప్రభుత్వం తీసుకునే చర్యలపైనా చర్చకు వచ్చే అవకాశముంది. పుల్వామా ఉగ్రదాడి వివరాల్ని, ఘటనా సమాచారాన్ని అన్ని పార్టీలకు తెలియజేయనుంది. ప్రభుత్వ చర్యలపై ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నించనుంది.
సీసీఎస్ భేటీలో నిర్ణయం....
శుక్రవారం జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఎస్) సమావేశంలో అఖిలపక్ష సమావేశం జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి ప్రధానమంత్రి నేతృత్వం వహించారు.
ఘటనకు బాధ్యులైన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఆసక్తి రేకెత్తిస్తోంది.