![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
'వందే భారత్ ఎక్స్ప్రెస్' వారంలో 5 రోజులు మాత్రమే పయనిస్తోంది. సోమ, గురువారాల్లో రైలు నిలిపివేస్తారు. ఈ రైలుకు లభిస్తోన్న ఆదరణ వల్ల ఫిబ్రవరి 24 నుంచి మార్చి 3 వరకు సుమారుగా 104 శాతం వరకు టికెట్లు అమ్ముడైపోయాయి.
ప్రధాని మోదీ 'వందే భారత్ ఎక్స్ప్రెస్'ను ప్రారంభించిన తరువాత, వారణాసి నుంచి దిల్లీకి తిరుగుప్రయాణంలో రైలు మొరాయించిన విషయం తెలిసిందే. దానిని బాగుచేసిన తర్వాత దిల్లీకి చేరింది. ఈ విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, భాజపా నేతల మధ్య సామాజిక మాధ్యమాల్లో వాద ప్రతివాదాలు చోటుచేసుకున్నాయి.