భారత త్రివిధ దళాధిపతులు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. సరిహద్దు భద్రతపై సైన్యం సన్నద్ధతను వివరించారు. అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌తో త్రివిధ దళాధిపతులు సమావేశమయ్యారు. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.
పాక్ భూభాగంలోని జైషే మహమ్మద్ ఉగ్రవాద తండాలపై భారత్ మెరుపుదాడులు నిర్వహించడం వల్ల ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ దాడులకు సమాధానంగా ప్రతీకార దాడులు చేస్తామని పాక్ బీరాలు పలుకుతోంది. దీంతో భారత సైనిక, నౌకా, వాయుదళాలు అప్రమత్తమయ్యాయి.
మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆ దేశ త్రివిధ దళాలు, జాతీయ భద్రతా కమిటీతో సమావేశమయ్యారు.