ETV Bharat / bharat-news

పుల్వామాలో బాంబును ఇలా పేల్చారా! - GRID

పుల్వామా ఉగ్రదాడిలో బాంబు​ను పేల్చేందుకు బైక్​ రిమోట్​ను ఉపయోగించి ఉంటారని  జమ్మూకశ్మీర్​ కౌంటర్​ టెర్రరిజం గ్రిడ్ పరిశోధన అనుమానాలు వ్యక్తం చేసింది.

పుల్వామాలో బాంబును ఇలా పేల్చారా!
author img

By

Published : Feb 18, 2019, 9:58 PM IST

జమ్మూకశ్మీర్​లో ఏడాది కాలంలో జరిగిన బాంబు దాడులను రిమోట్​ అలారమ్స్​ సాయంతో నిర్వహించారని జమ్మూకశ్మీర్​ కౌంటర్ టెర్రరిజం గ్రిడ్​ పరిశోధనలో తేలింది. తాజాగా జరిగిన పుల్వామా ఉగ్రదాడిలోనూ వీటినే ఉపయోగించి ఉంటారని గ్రిడ్​ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

గ్రిడ్​ నివేదికలో ఏముందంటే...

గతేడాది నుంచి ఉగ్రవాదులు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఐఈడీ బాంబులను పేల్చేందుకు మార్కెట్లలో సులభంగా దొరికే ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. వీటిల్లో ముఖ్యంగా మొబైల్స్, వాకీటాకీ, వాహనాల ఆంటిథెఫ్ట్ అలారమ్ రిమోట్లను వాడుతున్నారు.

ముఖాముఖి పోరు కన్నా దూరంగా ఉండి విధ్వంసం సృష్టించేందుకే ఉగ్రవాదులు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ప్రయాసతో ఎక్కువ నష్టం సంభవిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారని నివేదిక తెలిపింది. పుల్వామా దాడిని పరిశీలిస్తే.. కారులో అత్యంత ప్రమాదకరమైన ఆర్డీఎక్స్​ మిశ్రమ పేలుడు పదార్ధాన్ని మోసుకొచ్చిన జైషే మహమ్మద్ ఉగ్రవాది సీఆర్పీఎఫ్ వాహన శ్రేణి సమీపంలోకి రాగానే పేల్చివేసినట్టు అనుమానిస్తున్నారు.

నక్సల్స్​ తరహాలోనే...

పుల్వామా ఘటనలో వాహనాల దొంగలించకుండా ఉండేందుకు వాడే రిమోట్​ను ఉపయోగించినట్లు నివేదిక తెలిపింది. ఇవే పరికరాలను నక్సల్స్​తోపాటు ఉగ్రవాదులు వినియోగిస్తున్నారని పరిశోధనలో తేలింది. అయితే నక్సల్స్​, ఉగ్రవాదులకు సంబంధాలు ఉన్నట్లు సరైన ఆధారాలు లేనందున గ్రిడ్​లోని సీనియర్ అధికారులు నివేదికను తిరస్కరిస్తున్నారు.

ఇటీవల జరిగిన పేలుళ్లను గమనిస్తే ఆర్డీఎక్స్, పీఈటీఎన్​( పెంటాఎరిత్రిటాల్ టెట్రా నైట్రేట్), టీఎన్​టీ (ట్రైనైట్రోటోలీన్​)ను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు అమ్మోనియం నైట్రేట్​ను ఐఈడీ తయారీకి వాడుతున్నారు. ఈ రసాయనాలతో ఉగ్రవాదులు భారీ విధ్యంసానికి పాల్పడుతున్నారు. మిలిటరీతోపాటు సాధారణ ఎలక్ట్రిక్ డిటోనేటర్లను ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నారు. అయితే వీటికి ప్రాథమికంగా వాడే 'కమాండ్-వైర్​'(వైర్లను కలిపితే పేలేలా) నిర్మాణాన్ని వాడతుండటం గమనార్హం.

undefined

పరోక్ష పోరుకు మొగ్గు

జమ్మూలో బీభత్సం సృష్టించేందుకు తీవ్రవాదులు కొత్త వ్యూహాలు, సాంకేతికను అనుసరించడం దిగ్భ్రాంతి కలిగించే విషయం. వీటితో ప్రాణనష్టం అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. భద్రతా దళాలతో ముఖాముఖి పోరు బదులుగా ఉగ్రదాడులకు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. పరోక్షంగా దాడి చేసేందుకు ఈ మార్గాలు వారికి అనుకూలంగా మారాయి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.