ETV Bharat / bharat-news

'తమిళనాట మెగా కూటమి'

వచ్చే లోక్​సభ ఎన్నికల్లో భాజపా తమిళనాట అన్నాడీఎంకే-పీఎంకేలతో కలిసి పోటీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​ ప్రకటించారు.

author img

By

Published : Feb 20, 2019, 2:09 PM IST

2019 లోక్​సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఎన్డీయే. అందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ కూటమిని మరింత బలోపేతం చేస్తోంది. మహారాష్ట్రలో శివసేనతో పొత్తును ఖరారు చేసిన భాజపా తమిళనాట అన్నాడీఎంకే-పీఎంకే పార్టీల కూటమితో జట్టుకట్టింది.

భాజపా-అన్నాడీఎంకే-పీఎంకే

అన్నాడీఎంకే-పీఎంకే, భాజపాలు రానున్న లోక్​సభ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో జరగనున్న 21 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లోనూ ఉమ్మడిగానే బరిలో దిగనున్నట్లు ప్రకటించాయి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో భేటీ అయిన భాజపా సీనియర్ నేత, కేంద్రమంత్రి పీయూష్​ గోయల్​ ఈ మెగా పొత్తు(భాజపా-అన్నాడీఎంకే-పీఎంకే) ఖరారైనట్లు ప్రకటించారు.

5 స్థానాల్లో భాజపా

తమిళనాట మొత్తం 39 లోక్​సభ స్థానాల్లో 5 చోట్ల భాజపా పోటీ చేయనుంది. 7 స్థానాల్లో పీఎంకే పోటీ చేయనుంది. మిగతా స్థానాల్లో అన్నాడీంకే బరిలోకి దిగనుంది.

తమిళనాడులో కొత్త పొత్తు

తమిళనాట మెగా కూటమి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.