ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన కుదరదని తెలిపింది సుప్రీం. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు పోటీ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ భాజపా నేత అశ్వినీ ఉపాధ్యాయ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయి, జస్టిస్ సంజీవ్‌ఖన్నా సభ్యులుగా గల ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని ప్రాథమిక విచారణ చేసింది. ఇద్దరు పిల్లలున్న వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు, రాయితీలు, ప్రభుత్వ సహాయం కల్పించాలని సైతం పిటిషనర్ వెల్లడించారు. ఇద్దరు పిల్లల నిబంధనకనుగుణంగా జాతీయ, రాష్ట్ర పార్టీల చట్టాల్ని సైతం మార్చాలని అశ్వినీ ఉపాధ్యాయ తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఇద్దరు పిల్లల నిబంధనపై విచారణే వద్దు
ఈ వ్యాజ్యాన్ని విచారణకు నిరాకరించిన న్యాయమూర్తులు ప్రతిపాదిత పిల్ లోని అంశాలు పౌరుల చట్టబద్ధ హక్కుల్ని హరిస్తాయని వెల్లడించారు. ఓటు వేసే హక్కు, ఎన్నికల్లో పోటీచేసే హక్కుల్ని హరిస్తాయని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:అయోధ్యపై విచారణ రేపే!