రఫేల్ ఒప్పందంపై డిసెంబర్లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
రఫేల్ ఒప్పందంలో ధరలు, కొనుగోలు ప్రక్రియపై న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ అధికారులపై న్యాయవిచారణ జరపాలని దాఖలైన అభ్యర్థనలనూ విచారించనుంది సుప్రీంకోర్టు.
రూ.58వేల కోట్ల విలువైన రఫేల్ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, న్యాయవిచారణ జరపాల్సిన అవసరం లేదని డిసెంబరు 14న తీర్పునిచ్చింది న్యాయస్థానం.
ఒప్పందానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన సీల్డ్ కవర్లో తప్పుడు సమాచారం ఉందని రివ్యూ పిటిషన్లలో పేర్కొన్నారు సిన్హా, శౌరీ, భూషణ్.