పీఓకేలోని బాలాకోట్‌పై భారత వైమానిక దాడులు ఆత్మరక్షణ కోసమేనని భాజపా నేత, సీనియర్ న్యాయవాది సుబ్రమణ్యస్వామి స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటే అది మన భాగమేనన్నారు. సొంత భూభాగంలో బాంబులు వేసుకునే హక్కు ఏ దేశానికైనా ఉంటుంది.
ఈ దాడులు ఐరాస సూచించిన విధంగా ఆత్మరక్షణ పరమైనవేనని పేర్కొన్నారు. వీటికి అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించబోదన్నారు.