స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 152 పాయింట్లు నష్టపోయి 35, 656వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 47 పాయింట్లు పతనమై 10677 వద్ద ట్రేడవుతోంది.
రిజర్వు బ్యాంకు బోర్డు సమావేశం
రిజర్వు బ్యాంకు బోర్డు సమావేశం నేడు జరగనుండటం వల్ల విదేశీ మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గు చూపడమే మార్కెట్ల నష్టానికి కారణం.
మధ్యంతర బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి ఆర్బీఐ సమావేశంలో ప్రసంగించనున్నారు. ప్రభుత్వానికి చెల్లించే మధ్యంతర డివిడెండ్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
లాభాలు.. నష్టాలు
ఎన్టీపీసీ, వేదాంత, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఎస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హిందూస్థాన్ యునీలివర్, బజాజ్ ఆటో, టీసీఎస్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
15 పైసలు పతనమైన రూపాయి
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 15 పైసలు తగ్గింది. రూ.71.35 వద్ద మొదలైన రూపాయి... రూ.71.46వద్ద కొనసాగుతోంది.