ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పైపులు తీసుకెళుతున్న లారీ అదుపు తప్పడం వల్ల బస్సు, కారు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇదీ చదవండి:కాలిందీ ఎక్స్ప్రెస్లో పేలుడు
లఖ్నవూ-ఆగ్రా రహదారిపై మీర్జాపూర్ ఆజిగవన్ గ్రామ సమీపంలో ప్లాస్టిక్ పైపులు తీసుకెళుతున్న లారీ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. పైపులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. పైపుల వల్ల వెనకాల వస్తున్న బస్సు, కారు అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాయి.
మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.