భద్రతా బలగాల మానవ హక్కుల రక్షణపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించింది. విధి నిర్వహణలో సైనికులపై దాడులు జరుగుతున్నాయని ఈ పిటిషన్ పేర్కొంది.
ప్రధాన న్యాయముర్తి జస్టీస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, రక్షణశాఖ, జాతీయ మానవ హక్కుల సంఘాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
19ఏళ్ల ప్రీతి కేదర్ గోఖలే, 20 ఏళ్ల కాజల్ మిశ్రా ఈ అభ్యర్థనను దాఖలు చేశారు. భద్రతా బలగాలపై మానవ హక్కుల ఉల్లంఘనలను అదుపుచేయడానికి పాలసీ రుపొందించాలని పిటిషన్లో పేర్కొన్నారు.