పుల్వామా ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా కశ్మీరీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. విద్యార్థులు, మైనారిటీలపై బెదిరింపులు, దాడులు, బహిష్కరణ వంటి కేసుల్లో తక్షణ, అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు 11 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను ఆదేశించింది.
ఇది చూడండి:"ముమ్మాటికీ శిక్షార్హమే"
కశ్మీరీలపై దాడులను అరికట్టాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మూకల దాడులను దర్యాప్తు చేస్తున్న నోడల్ అధికారులు ఇప్పటి నుంచి కశ్మీరీలపై దాడుల కేసుల దర్యాప్తునూ చేపట్టాలని ఆదేశించింది. నోడల్ అధికారులకు విస్తృత ప్రచారం కల్పించాలని కేంద్ర హోంశాఖకు సూచించింది.