బెంగళూరు యెలహంక ఎయిర్ బేస్క్యాంప్లో రెండు విమానాలు ఢీకొని కూలిపోయాయి. 'ఏరోఇండియా-2019' కార్యక్రమానికి సన్నాహకాలు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గురైన రెండు విమానాలు 'సూర్య కిరణ్ ఏరోబాటిక్స్' బృందానికి చెందినవని అధికారులు తెలిపారు. కమాండర్ సందీప్ ఉన్నికృష్ణన్ నివాసానికి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
పైలట్ మృతి
ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఒక పైలట్ మృతి చెందాడు. మరో పైలట్ సహా స్థానికుడికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు.
రేపటి నుండే ఏరోఇండియా-2019
ఏరోఇండియా-2019 కార్యక్రమం బెంగళూరులో రేపటి నుండి అయిదు రోజులపాటు(ఫిబ్రవరి 24 వరకు) జరగనుంది. కార్యక్రమం ప్రారంభమయ్యే ఒకరోజు ముందే ఈ ప్రమాదం జరిగింది.