తేజస్ యుద్ధవిమానంలో భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ మొదటిసారి ప్రయాణించారు. బెంగళూరులో జరుగుతున్న ఏరోఇండియా షోలో మరో పైలట్‌తో కలిసి ఆయన 30 నిమిషాల పాటు విహరించారు. దీనికోసం ముందుగా అవసరమైన శిక్షణ తీసుకున్నారు రావత్.
"ఎల్సీఏ తేజస్‌లో ప్రయాణించడం అద్భుతమైన అనుభవం. ఇది మన సైన్యానికి మరింత శక్తినిస్తుంది. ఇందులో లక్ష్యాలను ఛేదించే వ్యవస్థ బాగుంది."
-జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్
తేజస్‌ను ఎయిర్‌షో ప్రారంభమైన రోజునే వాయుసేనకు అందించారు. తేజస్‌ను ధ్రువీకరిస్తూ‘‘పూర్తిస్థాయి నిర్వహణ అనుమతి(ఎఫ్‌వోసీ)’ పత్రాన్ని డీఆర్‌డీవో బుధవారం అందజేసింది. తేజస్‌కు 2013లోనే ప్రాథమిక నిర్వహణకు అనుమతి లభించింది. వాయుసేనకు చెందిన 45స్క్వాడ్రన్‌లో 2016 జులైలో తేజస్‌ను ప్రవేశపెట్టారు. అప్పటినుంచి 1,500 సార్లు విజయవంతంగా పరీక్షించారు.
ప్రత్యేకతలు
- తేజస్‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హల్) ఉత్పత్తి చేసింది.
- గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకునే సదుపాయం
- ఎలక్ట్రానిక్ యుద్ధ సూట్లు
- ఆయుధ వ్యవస్థ