ETV Bharat / bharat-news

'సంఝౌతా'కు పాక్ బ్రేకులు

భారత్​-పాక్​ ఉద్రిక్తతలతో సంఝౌతా ఎక్స్​ప్రెస్​ రైలు నిలిచిపోయింది. భారత్ నుంచి యధావిధిగా రైలు నడుస్తుందని రైల్వే మంత్రి పీయూష్​ గోయల్​ ప్రకటించగా, రైలును రద్దు చేసినట్లు పాకిస్థాన్​ ప్రకటించింది.

సంఝౌతా ఎక్స్​ప్రెస్
author img

By

Published : Feb 28, 2019, 1:29 PM IST

భారత్-పాక్​ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్​ప్రెస్​ను నిలిపివేస్తున్నట్లు పాక్​ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు అందేవరకు ఈ నిలిపివేత ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పాకిస్థాన్​ స్పష్టంచేసింది.

ఎప్పుడు ప్రయాణం:

ప్రతి సోమవారం, గురువారం పాకిస్థాన్​లోని లాహోర్​ నుంచి భారత్​కు బయల్దేరుతుంది సంఝౌతా రైలు. గురువారం 16 ప్రయాణికులతో భారత్​కు వెళ్లాల్సిన రైలును రద్దు చేస్తున్నట్లు పాక్​ ప్రకటించింది. అకస్మాత్తుగా రద్దు నిర్ణయం ప్రకటనతో ప్రయాణికులు లాహోర్​లోనే నిలిచిపోవాల్సి వచ్చింది.

భారత్​ నుంచి యధావిధిగానే:

భారత్​ నుంచి పాక్​ వైపు వెళ్లే రైలు మాత్రం యధావిధిగా నడుస్తుందని రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​ ప్రకటించారు. బుధవారం రాత్రి 11 గంటల 20 నిమిషాలకు 27 మంది ప్రయాణికులతో దిల్లీ నుంచి బయల్దేరిందని ఇందులో 24 మంది భారతీయులు, ముగ్గురు పాకిస్థాన్​ జాతీయులున్నారని ఉత్తర రైల్వే అధికారి దీపక్​ కుమార్​ తెలిపారు.

ఒప్పందం ప్రకారం:

1971 సిమ్లా ఒప్పందం ప్రకారం 1976 జులై 22న భారత్-పాక్​ మధ్య సంఝౌతా ఎక్స్​ప్రెస్ ప్రారంభమయింది. దీనిలో ఆరు స్లీపర్​, మూడు ఏసీ కోచ్​లు ఉన్నాయి.

సంఝౌతా ఎక్స్​ప్రెస్​ నడిచేనా

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.