.
కేరళ రక్షకభట విభాగంలో ఓ అమ్మాయి ఉద్యోగంలో చేరింది. పోలీస్ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఆమె సందర్శకులకు నమస్కరిస్తోంది. వచ్చిన వారికి మార్గనిర్దేశం చేస్తోంది. ఇందులో వింతేముంది అంటారా. ఆమె మనిషి కాదండి... మరమనిషి మరి.
ఇది కూడా చూడండి:'
కేపీ బోట్‌గా పిలిచే ఈ ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించి,పోలీస్‌శాఖకు అందజేశారు. పోలీస్ అధికారులను, సందర్శకులను అలరిస్తూ చక్కగా విధులు నిర్వర్తిస్తోంది ఈ రోబో. రోబో మాటలకు ఫిదా అవుతున్నారు అక్కడివారు. పోలీసు శాఖలో రోబోను ప్రవేశపెట్టడం దేశంలో ఇదే తొలిసారి.