రాజకీయ అరంగేట్రంపై మరో ప్రకటన చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టేందుకు తొందరేమీ లేదని స్పష్టం చేశారు.
తన అనుభవాన్ని వృథాగా పోనివ్వనని, ప్రజా జీవితంలో ముఖ్యపాత్ర పోషిస్తానని ఆదివారం ఫేస్బుక్లో పోస్ట్ చేశారు వాద్రా. ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక బాటనే వాద్రా అనుసరిస్తారన్న ఊహాగానాలు వచ్చాయి.
ఇదీ చూడండి: వస్తున్నా మీకోసం....
వాద్రా పోస్ట్‌కు తగినట్లు ఆయన స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో కొన్ని పోస్టర్లు వెలిశాయి. ఎన్నికల్లో పోటీచేయాలని వాటి ద్వారా కోరారు కొందరు స్థానికులు. కాసేపటికే... రాజకీయాల్లోకి వచ్చేందుకు తొందరేమీ లేదని వాద్రా ప్రకటించారు.
విదేశాల్లో అక్రమాస్తుల కొనుగోలు, రాజస్థాన్ బికనేర్‌లో భూకుంభకోణం ఆరోపణలపై ప్రస్తుతం వాద్రా ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు.