72 వేల 400 అసాల్ట్ రైఫిళ్లను సుమారు రూ. 700 కోట్ల రూపాయలు వెచ్చించి ఆయుధాల్ని సమకూర్చుకుంటోంది. ఇప్పటికే ఇలాంటి అత్యాధునిక రైఫిళ్లను అమెరికా దళాలతో పాటు, ఇతర ఐరోపా దేశాల్లో వినియోగిస్తున్నారు.
వీలైనంత త్వరగా భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒప్పందంలో భాగంగా సంవత్సరంలోపే ఈ రైఫిళ్లు భారత్కు చేరనున్నాయి. ప్రస్తుతం భారత సైన్యం ఇన్సాస్ రైఫిళ్లను వినియోగిస్తోంది. 5.56X45 mm ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో 7.62X51 mm అసాల్ట్ రైఫిళ్లను తేనున్నారు.
ఈ బలమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన రైఫిళ్లతో భారత సైన్యానికి మరింత బలం చేకూరుతుందని భావిస్తోంది రక్షణశాఖ. ఈ ఒప్పందానికి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల ప్రారంభంలోనే ఆమోదం తెలిపారు.