పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేలా దౌత్యపరమైన ప్రక్రియ ప్రారంభిస్తామని ఉదయమే ప్రకటించారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.
హాజరైన వివిధ దేశాలు
జర్మనీ, హంగేరీ, ఇటలీ, ఐరోపా సమాఖ్య, కెనడా, బ్రిటన్, రష్యా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, స్వీడన్, స్లోవేకియా, ఫ్రాన్స్, స్పెయిన్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, నేపాల్ దేశాల ప్రతినిధులు భారత విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన భేటీకి హాజరయ్యారు.
అత్యంత ప్రాధాన్య దేశం హోదా రద్దు
ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై తీవ్రంగా స్పందించిన భారత్ ఇప్పటికే అత్యంత ప్రాధాన్య దేశం హోదాను రద్దు చేసింది. డబ్ల్యూటీఓ సభ్య దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసింది. ఫలితంగా పాకిస్థాన్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలు విధించే అవకాశం భారత్‌కు లభించింది.