రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. ఎస్పీ సభ్యుల నిరసనలతో ఎగువ సభ హోరేత్తింది. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను లఖ్‌నవూ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా రాజ్యసభలో గందరగోళం సృష్టించారు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని ప్రమాణస్వీకార మహోత్సవానికి వెళ్తుండగా విమానాశ్రయంలో పోలీసులు అఖిలేష్‌ను అడ్డుకున్నారు.
ఈ అంశంపై నోటీసులు ఇవ్వనందున చర్చకు అనుమతించలేనని ఛైర్మన్ వెంకయ్యనాయుడు తేల్చిచెప్పారు. ఛైర్మన్ అనుమతిలేనిదే ఎటువంటి సమస్యను చర్చించకూడదని వెంకయ్య సభ్యులకు చెప్పారు. అయినా సభ్యులు ఆందోళనలు తగ్గకపోవడంతో వెంకయ్య సభను వాయిదా వేశారు.