ఉగ్రవాదంపై పోరులో విజయం సాధించి తీరతామని ధీమా వ్యక్తంచేశారు కేంద్రహోంమంత్రి రాజ్నాథ్ సింగ్. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో పర్యటించారాయన. తాజా పరిస్థితులపై గవర్నర్, ఉన్నతాధికారులతో సమీక్షించారు.
వేర్పాటువాదులు, హురియత్ నేతలపై పరోక్ష విమర్శలు గుప్పించారు రాజ్నాథ్. పాకిస్థాన్ సహా ఆ దేశ నిఘా సంస్థ-ఐఎస్ఐ నుంచి నిధులు పొందుతున్నవారికి కల్పిస్తున్న భద్రతపై పునరాలోచించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.