భారత వాయుసేన పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలపై దాడి చేసిన సమయంలో... అక్కడి పౌరులకు ఏ హానీ జరగలేదని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్. అయినా పాక్ కుటిల బుద్ధితో అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
పక్కా ప్రణాళికతో ఉగ్రశిబిరాలపైన మాత్రమే వాయుసేన దాడి చేసిందన్నారు. ముష్కరులు మాత్రమే హతమయ్యారని తెలిపారు. పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదని పునరుద్ఘాటించారు.
కశ్మీర్ ఎప్పటికైనా మనదే..
పాకిస్థాన్‌కి భారత్ గట్టిగా బుద్ధి చెప్పిందన్నారు రాజ్‌నాథ్. కశ్మీర్ ఎప్పటికైనా మనదేశంలో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. ప్రపంచంలోని ఏ శక్తీ మన దేశం నుంచి కశ్మీర్‌ను వేరు చేయలేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నిసార్లు చెప్పినా వినలేదు..
ఉగ్రవాదాన్ని అణచివేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పాకిస్థాన్ పెడచెవిన పెట్టిందన్నారు రాజ్‌నాథ్.
" మీ దేశంలో వేళ్లూనుకొని ఉన్న ఉగ్రవాదాన్ని అంతం చేయాలని పాకిస్థాన్‌కు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. అయినా వినలేదు. ఉగ్రమూకలకు పాక్ ఆశ్రమిస్తోంది. కానీ మాది ఉగ్రవాద బాధిత దేశమని పాక్ ప్రధాని ఇమ్రాన్ అంటున్నారు. అలాంటప్పుడు మీ దేశంలో పాగా వేసిన ఉగ్రమూకలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి. దీనికి ఆయన దగ్గర సమాధానం లేదు" -- రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి