నాలుగో రోజు 11 గంటలు
శారదా కుంభకోణానికి సంబంధించి సాక్ష్యాధారాలు మాయమయ్యాయన్న ఆరోపణలపై రాజీవ్‌కుమార్‌పై ప్రశ్నలు సంధిస్తుంది సీబీఐ. నాలుగో రోజు షిల్లాంగ్‌లోని సీబీఐ కార్యాలయంలో సుమారు 11 గంటల పాటు రాజీవ్‌ను ప్రశ్నించింది.
రాజీవ్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్ ఫిబ్రవరి 10,11న విచారణ ఎదుర్కొన్నారు. శారదా కుంభకోణం కేసులో 2013లో అరెస్టయ్యారు కునాల్. 2016లో బెయిల్‌పై బయటికొచ్చారు.
ఫిబ్రవరి 3న రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించటానికి ఆయన నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులను కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నారు. ఆ ఘటన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లింది సీబీఐ. విచారణకు సహకరించాల్సిందిగా రాజీవ్‌ను ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. అతణ్ని అరెస్టు చేయొద్దని సీబీఐకి సూచించింది.