నీటి కొరత తమిళనాడు ప్రధాన సమస్య. దీనిపై బలమైన పోరాటం చేస్తాం. ఇదే అంశంతో ప్రజల్లోకి వెళతాం. ప్రస్తుతం నా దృష్టి మొత్తం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. -రజనీకాంత్, సినీ నటుడు
2017 డిసెంబరులో తన రాజకీయ ప్రస్థానంపై స్పష్టతనిచ్చిన దగ్గర నుంచి అభిమానులతో తలైవా వీలు చిక్కినప్పుడల్లా సమావేశమవుతున్నారు. ఆయన అభిమాన సంఘానికి 'రజనీ మక్కల్ మండ్రమ్' అని పేరు మార్చారు. పార్టీ క్షేత్ర స్థాయి నిర్మాణంపై ప్రస్తుతం ఈ సంఘం ప్రణాళికలు రచిస్తోంది.
రజనీకాంత్ ప్రజా సమస్యల పట్ల దృష్టి సారించారు. గతంలో తూత్తుకుడి ఘటనలో బాధిత కుటుంబాలను కలసి బాసటగా నిలిచారు.