అటవీ ప్రాంతాల నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలముఖ్యమంత్రులను కాంగ్రెస్అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశించారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పుదుచ్చేరి సీఎంలకు లేఖలు రాశారు.
అటవీ ప్రాంత నివాసులను ఖాళీ చేయించేందుకు చేపట్టిన చర్యలపై అఫిడవిట్ సమర్పించాలని 21 రాష్ట్రాల ప్రభుత్వాలను ఈనెల 13న సుప్రీం ఆదేశించింది. ప్రక్రియ ఏ మేరకు పూర్తయిందో తెలియజేయాలని ఆజ్ఞాపించింది.
'అడవి, నీరు, నేల... ఆదివాసీలకు జీవించే హక్కులో భాగం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్, పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశా' అని ఫేస్బుక్ ఖాతాలో రాహుల్ పోస్ట్ చేశారు.