ETV Bharat / bharat-news

'ఖాళీ చేయాల్సిందే' - నేషనల్​ హెరాల్డ్​

దేశ రాజధానిలోని నేషనల్​ హెరాల్డ్​ భవనాన్ని ఖాళీ చేయాలని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టులో నేషనల్​ హెరాల్డ్​ ప్రచురణకర్త దాఖలు చేసిన వ్యాజ్యం తిరస్కరణకు గురైంది.

నేషనల్​ హెరాల్డ్​
author img

By

Published : Feb 28, 2019, 12:57 PM IST

Updated : Feb 28, 2019, 3:26 PM IST

నేషనల్​ హెరాల్డ్​కు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఐటీవో పరిసరాలను ఖాళీ చేయాలని గతంలో న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హెరాల్డ్​ ప్రచురణకర్త ఏజెఎల్​ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని తిరస్కరించింది దిల్లీ హైకోర్టు.

పిటిషనన్​ను విచారించిన జస్టిస్​ రాజేంద్ర మీనన్ నేతృత్వంలోని​ ధర్మాసనం వ్యాజ్యాన్ని తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది.

అసలు సంగతేంటి..?

దేశ రాజధానిలోని నేషనల్​ హెరాల్డ్​ భవనంలో ముద్రణ కార్యాకలాపాలు జరగడం లేదనే కారణంతో 56 ఏళ్ల లీజును రద్దు చేస్తూ గతేడాది అక్టోబరు 30న నోటీసులు జారీ చేసింది కేంద్రం. దాన్ని వ్యతిరేకిస్తూ ఏజేఎల్​ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నేషనల్​ హెరాల్డ్​ రెండు వారాల్లో ఐటీవో పరిసరాలను ఖాళీ చేయాలని ఏకసభ్య ధర్మాసనం 2018 డిసెంబర్​ 21న ఆదేశాలు జారీ చేసింది. దాన్ని సవాల్​ చేసింది ఏజేఎల్​.

Intro:Body:Conclusion:
Last Updated : Feb 28, 2019, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.