పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారులైన 'జైష్ ఏ మహమ్మద్' కమాండర్ రషీద్ ఘాజీ, కమాండర్ కమ్రాన్, మరో ఉగ్రవాది హిలాల్ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఆర్మీ మేజర్, ముగ్గురు జవాన్లు సహా ఒక పౌరుడు మృతిచెందారు.
దక్షిణ కశ్మీర్లో సోమవారం 16 గంటల పాటు సుదీర్ఘ ఎన్కౌంటర్ జరిగింది. 'పింగ్లాన్'లో ముష్కరులున్నట్లు పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న సైన్యం పక్కా ప్రణాళికతో ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని తనిఖీ చేసింది.
ఆ సమయంలో జవాన్లపైకి దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు. వెను వెంటనే స్పందించిన బలగాలు ఉగ్రమూకకు దీటుగా బదులిచ్చాయి. ఇరు వర్గాల మధ్య భీకర పోరు జరిగింది.
ఈ ఘటనలో పుల్వామా దాడి కీలక సూత్రధారులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.