జమ్ముకశ్మీర్ పుల్వామాలోని పింగ్లాన్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాాయి. జైష్-ఏ- మహ్మద్(జేఈఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ భారత సైన్యానికి చిక్కినట్లు సమాచారం. పుల్వామా ఆత్మాహుతి దాడిలో ఇతడిని కీలక సూత్రధారిగా అనుమానిస్తున్నారు.
పింగ్లాన్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఆదివారం అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మేజర్ సహా నలుగురు భద్రతా సిబ్బంది అసువులు బాశారు. మరో జవాన్‌కు తీవ్రగాయాలయ్యాయి.
ముష్కరులు ఉన్నారనే సమాచారంతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు భద్రతా సిబ్బంది. ఆ సమయంలోనే సైనికులపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. అనంతరం తాజా ఎన్కౌంటర్లో జేఈఎం కమాండర్ భారత సైన్యానికి చిక్కినట్లు భావిస్తున్నారు.
పుల్వామాలోనే గురువారం జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఆ ఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు.