ETV Bharat / bharat-news

"ఎందాకైనా వెళ్లాలి" - pulwama families

పుల్వామా ఘటనకు ప్రతీకారంగా జైషే మహ్మద్ ఉగ్రక్యాంప్​పై వాయుసేన దాడిని వీర జవాన్ల కుటుంబీకులు స్వాగతించారు. ప్రభుత్వం దాడుల్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.

వాయుదాడిపై పుల్వామా బాధిత కుటుంబాల ప్రతిస్పందన
author img

By

Published : Feb 26, 2019, 4:56 PM IST

Updated : Feb 26, 2019, 7:02 PM IST

పుల్వామా దాడికి ప్రతీకారం మొదలుపెట్టింది భారత్. పాక్ ఆక్రమిత కశ్మీర్​లోని జైషే మహ్మద్ క్యాంపుపై తెల్లవారుజామున యుద్ధ విమానాలతో వెళ్లి బాంబుల్ని వదిలింది. ఈ వాయుదాడిలో 200-300 మంది ఉగ్రవాదులు మృతి చెంది ఉంటారని అంచనా. వాయుసేన చర్యపై పుల్వామా ఘటనలో మృతిచెందిన సైనికుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

భారత సేనలు పాక్​కు బుద్ధి నేర్పుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంత మంది ఉగ్రవాదులు ఉంటే అంతమందిని చంపాలని ఆకాంక్షిస్తున్నారు. వాయు దాడితో పుల్వామా ఘటనలో అసువులు బాసిన ఉత్తరప్రదేశ్ ​వాసి జవాన్ విజయ్​కుమార్ మౌర్య కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు.

మేం ఆశించిన విధంగా కేంద్రం వాయుదాడి చేసింది. దాడి పట్ల మాకెంతో సంతోషం కలిగింది. రాగల 50-100 సంవత్సరాల్లో జైషే వంటి సంస్థలు కలలో కూడా దాడుల గురించి ఊహించని విధంగా దాడులు జరపాలి. -విజయ్ కుమార్ మౌర్య సోదరుడు
వాయుసేన ఉగ్రవాదుల్ని చంపినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎంతమంది ఉగ్రవాదులుంటే వారందరిని ఏరివేయాలి.- విజయ్​కుమార్ మౌర్య భార్య

పుల్వామా దాడిలో అసువులు బాసిన రాజస్థాన్​కు చెందిన సైనికుడు హరిసింగ్ కుటుంబీకులు వాయుదాడిపై ఆనందబాష్పాలు రాల్చారు. హరిసింగ్ మృతికి భారత్​ బదులు తీర్చుకుందన్నారు.

వాయుదాడి ఎంతో మంచి పని. ఇంకా మిగిలిపోయిన ఉగ్రవాదుల్నీ మట్టుబెట్టాలి. -హరిసింగ్ తండ్రి

పాక్​కు సిసలైన జవాబు. నక్కి దాడులు చేస్తున్న ఉగ్రవాదుల్ని వెతికి చంపడం సంతోషం కలిగించింది.-హరిసింగ్ సోదరుడు

ఉత్తరప్రదేశ్ మీరట్​కు చెందిన పుల్వామా వీర జవాన్ అజయ్​కుమార్ కుటుంబీకులు వాయుసేన దాడిపై స్పందించారు.

undefined

నా భర్త అమరుడైన ఆవేదన ఎప్పటికీ ఉంటుంది. వాయుదాడి మాత్రం బాధనుంచి ఉపశమనం కలిగించింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరైనది.-అజయ్​కుమార్​ సతీమణి

పుల్వామా అమరుడు అశ్వినీ ఖంచీ కుటుంబీకులు వాయుసేన ధీరత్వాన్ని కొనియాడారు. అశ్వినీ మృతికి బదులు తీర్చుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం దాడుల్ని కొనసాగించాలి. ఎంతవరకైనా ముందుకెళ్లాలి-అశ్విని ఖంచీ తండ్రి

"ఎందాకైనా వెళ్లాలి"

Intro:Body:Conclusion:
Last Updated : Feb 26, 2019, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.