ఉగ్రదాడికి ప్రతి చర్యల కోసం సమయం,స్థలంపై నిర్ణయాలు తీసుకునే విషయంలో భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ కల్పించినట్లు మోదీ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మోదీ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పుల్వామా ఘటన గురించి ప్రస్తావించారు ప్రధాని.
అక్కసుతోనే పొరుగుదేశం దాడికి తెగబడినట్లు పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండా మోదీ విమర్శించారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న ఆ దేశం నిరాశలో కూరుకుపోయి భారత్‌పై ఉగ్ర దాడి చేసిందని మోదీ విమర్శించారు. రోజూ వారీ ఖర్చుల కోసం యాచక పాత్రతో ప్రతి దేశానికి వెళ్తారని పాక్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇలాంటి దాడులతో భారత ప్రగతిని ఆపాలని దాయాది దేశం అనుకుంటోదని, కానీ భారత్ తను ఎంచుకున్న మార్గంలో పగలు, రాత్రి అని తేడా లేకుండా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మోదీ స్పష్టం చేశారు.
పలు రాజకీయ కార్యక్రమాల్లో మోదీ పాల్గొనాల్సి ఉండగా పుల్వామా దాడి కారణంగా వాటిని వాయిదా వేశారు. బుందేల్‌ఖండ్ లో రక్షణ నడవాకు శంకుస్థాపన చేశారు మోదీ.