ETV Bharat / bharat-news

'ఆయనది అధికార దాహం' - piolt

మళ్లీ అధికారంలోకి రావాలనే తపనతో ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారని, దేశ ప్రాధాన్యాలను విస్మరిస్తున్నారని కాంగ్రెస్​ పార్టీ విమర్శించింది.

మోదీది అధికార దాహం : రణదీప్​ సుర్జేవాలా
author img

By

Published : Feb 28, 2019, 1:15 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రాధాన్యాలు విస్మరించి, మళ్లీ అధికారంలోకి రావాలని పరితపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
పాక్​ వద్ద బందీగా ఉన్న భారత పైలట్​ క్షేమంగా తిరిగిరావాలని దేశమంతా ప్రార్థిస్తుంటే, మోదీ మాత్రం వీడియో కాన్ఫరెన్స్​ రికార్డు చేసే పనిలో నిమగ్నమయ్యారని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణదీప్​ సుర్జేవాలా ట్విట్టర్​ వేదికగా విమర్శించారు.

"ప్రధాని మోదీ దేశ ప్రాధాన్యాలను విస్మరించారు. 132 కోట్ల భారత ప్రజలు వీరసైనికుడు వింగ్​ కమాండర్​ క్షేమంగా రావాలని ప్రార్థిస్తుంటే, ప్రధాని మాత్రం మళ్లీ అధికారంలోకి ఎలా రావాలని ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్​ ఈరోజు సీడబ్ల్యూసీ సమావేశాన్ని, ర్యాలీని రద్దు చేసింది. ప్రధాని మోదీ మాత్రం వీడియో కాన్ఫరెన్స్​ రికార్డు చేయడంలో నిమగ్నమయ్యారు." -రణదీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

  • Glaring case of misplaced priorities!

    132 Cr Indians pray for safe & immediate return of India’s brave-heart Wing Comm, Abhinandan but Modiji desperate only for re-election.

    Congress cancelled its imp CWC & Rally today.

    Pradhan Sevak hell-bent on creating a Video Conf. record! pic.twitter.com/ulIMzA35Xv

    — Randeep Singh Surjewala (@rssurjewala) February 28, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

విపక్షాల విమర్శలు

సాయుధ బలగాల త్యాగాలను భాజపా రాజకీయం చేయడంపై విపక్షాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. 21 పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వం తీరును విమర్శించాయి. దేశ సార్వభౌమాధికారం, సమైక్యతను కాపాడాలని కోరాయి.

undefined

యుద్ధమేఘాలు

పుల్వామా ఘటనకు ప్రతీకారంగా భారత్​ మెరుపుదాడులు చేయడం వల్ల పాక్​ ప్రతీకార దాడికి పాల్పడింది. పాక్​ వైమానిక దళాన్ని తరిమికొట్టిన భారత్​.. పాక్​ యుద్ధవిమానాన్ని నేలకూల్చింది. ఇదే సమయంలో భారత్​ తన మిగ్ యుద్ధ విమానాన్ని కోల్పోయింది. భారత్​ పైలట్​ వింగ్​ కమాండర్​ను పాకిస్థాన్ సైన్యం బందీగా పట్టుకుంది. ఇరుదేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలతో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.