దిల్లీలోని ఇండియా గేట్, అమర జవాన్ జ్యోతి సమీపంలో నిర్మితమైన జాతీయ యుద్ధ స్మారకాన్ని జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమానికి రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ సహా త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.
40 ఎకరాల్లో నిర్మితమైన ఈ స్మారకంలో 25వేల 942 మంది అమరుల పేర్లు సువర్ణక్షరాలతో గ్రానైట్ టాబ్లెట్లపై లిఖించారు. రూ.176 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు.
జాతీయ యుద్ధ స్మారకం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన 1970 నాటిది.
సైనికుల రుణం తీర్చుకునేందుకు ఇదొక చిన్న ప్రయత్నమని మోదీ అన్నారు. జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించటం తీర్థయాత్రకు వెళ్లినంత సమానంగా దేశప్రజలు భావిస్తారని ప్రధాని తెలిపారు.