సంఘటిత రంగంలో కేవలం డిసెంబర్లోనే 7.16 లక్షల ఉద్యోగ కల్పన జరిగినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. ఇది గత 16 నెలలతో పోలిస్తే అత్యంత గరిష్టం. సరిగ్గా ఏడాది ముందు ఈ సంఖ్య 2.37 లక్షలుగా ఉన్నట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ వెల్లడించింది.
2017 నవంబరు నుంచి 2018 డిసెంబర్ వరకు... అంటే 16 నెలల కాలంలో 72.32 లక్షల ఉద్యోగ కల్పన జరిగినట్లు డాటాలో తేలింది.
2018 డిసెంబర్లో 18-21 ఏళ్ల మధ్య ఉన్న యువతకు అత్యధికంగా 2.17లక్షల ఉద్యోగాలు రాగా.. 22-25 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతకు అంతకు తక్కువ ఉద్యోగాలు(2.03 లక్షలు) వచ్చాయి.