ఉగ్రవాదంపై పోరులో రక్షణ బలగాలకు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించాయి పార్టీలు. పుల్వామా దాడితో తీవ్రవాదాన్ని ఉపేక్షించకూడదని దేశం మొత్తం ఒకే గొంతుకతో గళమెత్తుతోందని తీర్మానంలో పేర్కొన్నాయి.
" దేశ ఐక్యత, సమగ్రత, రక్షణ కోసం భద్రత బలగాలు, ప్రభుత్వానికి పూర్తి మద్దతు పలుకుతున్నాం. తీవ్రవాదాన్ని రూపుమాపటానికి మద్దతు ఇస్తున్నాం. దేశ ఐక్యత, సమగ్రతకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ఉంటుంది. " - గులాంనబీ ఆజాద్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత
పాకిస్థాన్ పేరును ప్రస్తావించకుండానే ఆ దేశం తీరును అఖిలపక్షం తప్పుబట్టింది. పొరుగు దేశం తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసింది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నేరుగా పాకిస్థాన్‌పై యుద్ధం చేసి విజయం సాధించిన విషయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని శివసేన సభ్యులు సంజయ్ రౌత్ ప్రభుత్వాన్ని కోరారు.