ETV Bharat / bharat-news

పాక్​కు అమెరికా హెచ్చరిక

ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు సరైన చర్యలు తీసుకోవాలని దాయాది దేశం పాకిస్థాన్​ను హెచ్చరించింది అమెరికా.

షా మహ్మద్ ఖురేషికి మైక్ పాంపియో ఫోన్​కాల్
author img

By

Published : Feb 27, 2019, 9:56 AM IST

ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్​ను అమెరికా హెచ్చరించింది. వైమానిక దాడి అనంతరం ఎలాంటి ప్రతిచర్యకు పాల్పడకూడదని పేర్కొంది. పుల్వామా దాడి అనంతరం ప్రతిచర్యగా బాలాకోట్​లోని జైషే క్యాంపుపై వైమానిక దాడి చేసింది భారత్.

అమెరికా రక్షణ కార్యదర్శి మైక్​ పాంపియో పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్​ ఖురేషికి ఫోన్​ చేసి భారత్​కు వ్యతిరేకంగా ఎలాంటి సైనిక చర్య చేపట్టకూడదని హెచ్చరిక జారీ చేశారు. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్​కు సైతం ఫోన్​ చేశారు పాంపియో. భారత్​తో రక్షణ సహకారం కొనసాగుతుందని, శాంతి మార్గమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు.

"వైమానిక దాడి అనంతరం ప్రాంతీయ శాంతికై, రక్షణలో భాగస్వామ్య విషయమై మద్దతు కొనసాగుతుందని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​కు తెలిపాను"- మైక్​ పాంపియో

అమెరికా రక్షణ సలహాదారు జాన్ బోల్టన్ భారత రక్షణ సలహాదారు అజిత్​ ధోబాల్​కు ఫోన్​ చేశారు. స్వీయ రక్షణకై భారత్​ చేస్తున్న పోరాటంలో సహకారిస్తామని పేర్కొన్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.