భారత్ నుంచి పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి,బియాస్, సట్లెజ్ నదులపై ఆనకట్టలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. తద్వారా యమునా నదిలో ఎక్కువ నీటిని నిల్వ చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. నిల్వ చేసిన నీటిని జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలవైపు తరలించాలని భావిస్తున్నట్లు గడ్కరీ స్పష్టం చేశారు.
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గడ్కరీ స్పష్టం చేశారు.