పుల్వామా ఘటన అనంతరం జమ్మూకశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద దాయాది దేశం పాకిస్థాన్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వరుసగా మూడో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
గురువారం జమ్మూకశ్మీర్ సరిహద్దు ప్రాంతం పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలో పాక్ సైన్యం మోర్టార్ బాంబులు విసిరింది.
పాక్ చర్యలకు భారత బలగాలు దీటుగా బదులిచ్చాయి.
గడిచిన 24 గంటల్లో పాక్ సైన్యం ఐదు సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించినట్లు భారత భద్రతా అధికారులు వెల్లడించారు.
2018 సంవత్సరంలో ఏకంగా 2936 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్ సైన్యం. గత పదిహేనేళ్లలో ఇదే అత్యధికం.
ఉద్రిక్త పరిస్థితుల మధ్య సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.