భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో నేషనల్ కమాండ్ అథారిటీ(ఎన్సీఏ) సమావేశానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. అణ్వాయుధ వ్యవహారాలపై ఉన్నతస్థాయిలో చర్చించాలని... మంగళవారం జరిగిన జాతీయ భద్రతా కమిటీలో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. బాలాకోట్ ఉగ్రస్థావరాలపై మంగళవారం భారత సైన్యం మెరుపుదాడుల పరిణామాలపై ఎన్సీఏ సమావేశంలో చర్చించనున్నారు.
అణ్వస్త్రాలకు సంబంధించిన విధాన రూపకల్పన, పరిశోధన- అభివృద్ధి, అణు ఆయుధశాలల నిర్వహణ- కార్యాచరణ, నియంత్రణను ఎన్సీఏ పర్యవేక్షిస్తుంది.