పుల్వామా దాడికి కారణమైన పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌కు ఉన్న అన్ని దౌత్యపరమైన అవకాశాలపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. పాక్‌ను 'వంచన దేశం'గా అభివర్ణిస్తూ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడం చూస్తే ఆ నేరానికి పాక్ బాధ్యత వహిస్తున్నట్లు తెలుస్తుందన్నారు.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై జైట్లీ మండిపడ్డారు. భారత్ ప్రస్తుతం ప్రతీకార భావంతో రగిలిపోతోందని జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఆ దేశ ప్రధాని పుల్వామా దాడిపై చర్యలు తీసుకునేందు ఆధారాలు కోరుతున్నారు. చర్యలు తీసుకోవడానికి ఆధారాలే అడ్డు వస్తే అది తప్పించుకునే ప్రయత్నమే. ఎందుకంటే నేరానికి పాల్పడ్డ వ్యక్తి మీ దేశంలోనే ఉంటూ నేరం చేసినట్లు అంగీకరిస్తున్నాడు. ఇంతకంటే ఆధారాలు మీకేం కావాలి?నా జీవితంలో ఎన్నో యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన ప్రధానులను చూసా, వాటన్నింటి కన్నా ఇప్పుడు రెట్టింపు ఆవేశం కలుగుతోంది."
-అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి