జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసిన భారత వాయుసేనను విపక్షాలు అభినందించాయి. సైనికుల ధైర్యసాహసాలను కొనియాడాయి. దిల్లీలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా 21 పార్టీల నేతలు హాజరయ్యారు.
"ఫిబ్రవరి 14న జైషే మహ్మద్ చేసిన ఉగ్రదాడిని ఈ వేదికగా 21 పార్టీలు ఖండించాయి. ఈ సమావేశంలో అమరులకు నివాళులర్పించాం. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత సైన్యానికి మద్దతిస్తాము. ఫిబ్రవరి 26న మెరుపు దాడులు చేసిన భారత వాయుసేనను అభినందించాము. సైన్యం ధైర్యసాహసాలను అభినందించాము. సైనికుల ప్రాణత్యాగాలను ప్రభుత్వం రాజకీయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాము."
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు.